Saturday, May 4, 2024

అన్ని పార్టీల ఆశలు అసంతృప్తులపైనే…

- Advertisement -
- Advertisement -

అసమ్మతులు తమ వైపు మళ్లేందుకు తాయిలాలు
ఈసారి విజయానికి సహకరించాలని చీకటి ఒప్పందాలు
స్దానిక నేతలతో పార్టీకి దూరంగా ఉండేవారి గుర్తింపు
అసంతృప్తి నేతలకు ఆఫర్లు ఇస్తున్న కాంగ్రెస్, బిజెపి, బిఎస్పీ పెద్దలు 

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికల పోరు జరుగుతుండటంతో ఆయా పార్టీ పెద్దలు ఈసారి అధికారం దక్కించుకునేందుకు పడరాని తంటాలు పడుతున్నారు. ఎన్నికల్లో గట్టేందుకు కొత్త కొత్త ఎత్తులు వేస్తూ ప్రత్యర్ది పార్టీలను మట్టికరిపించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముందుగా విపక్ష పార్టీల్లో టికెటు ఆశించిన భంగపడే నేతలను గుర్తించి వారిని తమ వైపు మళ్లీంచుకునేందుకు తాయిలాలకు తెర లేపారు. కాంగ్రెస్,బిజెపి,బిఎస్పీ పార్టీలో ఈ బాగోతం బాగా నడుస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. నెల రోజుల కితం అధికారి బిఆర్‌ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక విడుత ప్రచారం నిర్వహించి 9 ఏళ్లలోప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు.

మూడోసారి బిఆర్‌ఎస్ అధికారం కట్టబెడితే అభివృద్దిలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్ధానంలో నిలబెడుతామని పేర్కొంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారానికి విపక్ష పార్టీల నేతలు ఖంగు తింటున్నారు. బిఆర్‌ఎస్ చీఫ్, సిఎం కెసిఆర్ ఊహించని విధంగా ఒకేసారి 115 మంది అభ్యర్థులు ప్రకటించడంతో ఆపార్టీలో అసమ్మతివాదాలు తమ పార్టీ పంచన చేరుతారని కాంగ్రెస్, బిజెపి సీనియర్లు ఆశ పల్లకీ తేలియాడారు. కానీ గులాబీ పార్టీ నుంచి బలమైన ఒక నాయకుడు కూడా ఆ పార్టీల దరి చేరలేదు. దీంతో చేసేదేమిలేక బిఆర్‌ఎస్ నాయకుల వైపు వెళ్లాంటే ఇతర పార్టీ నాయకులు జంకుతున్నారు.

దీంతో కాంగ్రెస్‌లోని అసంతృప్తులపై కాషాయం పార్టీ నేతలు కన్నేయగా, బిజెపి నేతల వైపు హస్తం పార్టీ చూస్తుండగా ఈరెండు పార్టీల అసమ్మతి నేతలు తమ పార్టీ బుట్టలో వేసుకునేందుకు బిఎస్పీ పార్టీ నాయకులు ప్లాన్ చేసి ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. సొంతంగా ఎవరు రాకపోవడంతో ఆయా పార్టీల సీనియర్లు మనమే టికెట్లు రాని నేతలు గుర్తించి డబ్బు, పదవులు ఆశచూపి చేర్చుకుందామని ద్వితీయ శ్రేణి నాయకులకు సూచిస్తున్నారు. ముందుగా మీ నియోజకవర్గం పరిధిలో ఎంతమంది ఉన్నారో జాబితా సిద్దం చేసి, తమకు పంపిస్తే వారితో చర్చలు జరిపి పార్టీకి మద్దతు పలికే విధంగా తాము చూసుకుంటామని కార్యకర్తలతో పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు స్క్రీనింగ్ కమిటీ సిద్దం చేసిన జాబితాలో 62 నుంచి 70 మంది అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదరగా 50 నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతుండగా అక్కడ అభ్యర్థుల ఎంపిక పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. దీంతో ఒకరి పేరు సోషల్ మీడియా ద్వారా లీకులు చేయడంతో మిగతా అభ్యర్థులు తమకు పార్టీ ప్రాదాన్యత ఇవ్వడం లేదని అనుచరుల ముందు వాపోతున్నారు. దీనిని పసిగట్టిన బిజెపి, బిఎస్పీ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్న నాయకులతో మంతనాలు జరిపి తమ పార్టీలో చేరితే టికెట్లు ఇస్తామని, లేదంటే సొంత పార్టీలో ఉండి అంతర్గత మద్దతు ఇవ్వాలని ఒప్పందాలు చేస్తుకున్నట్లు తెలిసింది.

హస్తం పార్టీలో ఉమ్మడి నల్లగొండలో 8 నియోజకవర్గాల్లో, మహబూబ్‌నగర్ 10, మెదక్ నాలుగు, నిజామాబాద్ మూడు, ఆదిలాబాద్ నాలుగు, ఖమ్మంలో ఐదు స్దానాల్లో, హైదరాబాద్‌లో 7, రంగారెడ్డిలో 6, వరంగల్ 05, కరీంనగర్ 6 స్దానాల్లో ముగ్గురు పోటీ పడుతుండగా వారిలో ఇద్దరిని తమ వైపు తిప్పుకునేందుకు కమలం, బిఎస్పీ పార్టీలు పోటీ పడుతున్నట్లు ఆశావాహాల అనుచరులు వెల్లడిస్తున్నారు. తమ నాయకునికి సొంత పార్టీలో టికెట్ రాకుంటే మరో రెండు పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు బహిరంగ ప్రచారం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News