Thursday, November 30, 2023

నర్మదాపురంగా హోషంగాబాద్

- Advertisement -
- Advertisement -
Hoshangabad city name changed to Narmadapuram
మధ్యప్రదేశ్ సిఎం ప్రకటన

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ నగరం పేరును నర్మాదాపురంగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం హోషంగాబాద్‌లో జరిగిన నర్మదా జయంతి కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. నర్మదా నది ఒడ్డున జరిగిన ఒక కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ హోషంగాబాద్ నగరం పేరును ప్రభుత్వం మార్చాలా వద్దా అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించగా మార్చాల్సిందేనంటూ అక్కడ హాజరైన ప్రజలు ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. కొత్త పేరు ఏమిటని ముఖ్యమంత్రి ప్రజలనే ప్రశ్నించగా నర్మదాపురం అంటూ వారు బదులిచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపుతున్నామని వారికి చెప్పారు. నర్మదా నది ఒడ్డున సిమెంట్ -కాంక్రీట్ కట్టడాలను ప్రభుత్వం అనుమతించబోదని ఆయన చెప్పారు. నదీ తీరాన ఉన్న నగరాలలో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

Hoshangabad city name changed to Narmadapuram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News