Friday, May 3, 2024

భార్య ముక్కు కొరికి పారిపోయిన భర్త

- Advertisement -
- Advertisement -

husband bites wife's nose at karnataka

 

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో ఓ శాడిస్ట్ భర్త మద్యం మత్తులో తాను కట్టుకున్న భార్య ముక్కు కోరికేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన ధార్వాడ్ తాలూకాలోని అమ్మినాబావి గ్రామంలో నిన్న రాత్రి జరిగింది. స్థానికంగా ఉండే గీత-ఉమేశ్ దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం గీత తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పుటుగా తాగి అక్కడికి వెళ్లిన ఉమేశ్ తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే కిరాతకంగా ఆమె ముక్కు కొరికేశాడు. అడ్డొచ్చిన అత్తపై కూడా దాడి చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన గీతను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉమేశ్ బెల్గాం జిల్లాలోని బైలహోంగల తాలూకాలోని వాలివాడ గ్రామంలో నివసిస్తున్నాడు. ఉమేశ్, గీతకు ఇద్దరు పిల్లలు. అయితే తాగుబోతుగా ఉన్న ఉమేశ్ ఐదేళ్ల ముందే భార్యతో గొడవపడి పుట్టింటికి పంపించాడు. అప్పటినుంచే భార్య ప్రవర్తనను అనుమానించేవాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

husband bites wife’s nose at karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News