Wednesday, May 15, 2024

సాంకేతికత సహాయంతో విద్యార్థులకు హైబ్రిడ్ విద్యాభోధన

- Advertisement -
- Advertisement -

Hybrid education for students with help of technology

మన తెలంగాణ,సిటీబ్యూరో: గత రెండేళ్లుగా సాంకేతిక పురోగతులతో వేగంగా పెనుమార్పులు చెందడంతో పాఠశాలలు, వ్యాపారాలు, వ్యక్తులు డిజిటలైజేషన్, పర్సనలైజేషన్ అనుగుణంగా మారాయి. అదే కోవలో ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ బాచుపల్లి స్కూల్ సాంకేతిక ప్రపంచంలో ఒక సముచిత స్దానం ఏర్పరుచుకుని డిజిటలైజేషన్‌లో అత్యుత్తమంగా ప్రయత్నిస్తుంది.

ఈసందర్భంగా ఓక్రిడ్జ్ స్కూల్ విద్యార్థిని వరుణి మాట్లాడుతూ విన్నూతమైన అభ్యాస పద్దతుల వంటి ఆప్లికేషన్‌లను యాక్సెస్ చేయడంతో లెర్నింగ్ మెథడాలజీలను ఆదుకోవడం ద్వారా అది విమర్శనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుచడంలో మాకు సహాయపడుతుందన్నారు. సైన్స్‌లో అన్ని కోణాల్లో వర్చువల్ రియాలిటీ స్వభావాన్ని తెలుసుకోవడంలో మాఉపాధ్యాయులు మాకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఈపద్దతిలో సైన్స్‌ని అన్వేషించడం ఆశ్చర్యకంగా, ఉత్తేజకరంగా ఉన్నదని, వర్చువల్ తరగతి గదుల పట్ల నా దృక్పధాన్ని మార్చివేసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News