Wednesday, May 8, 2024

మీడియా పేరుతో గుట్కా దందా.. నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

మేడ్చల్: మేడిపల్లి చెంగిచర్లలో గుట్కా తయారీ గుట్టును పోలీసులు బయటపెట్టారు. చెంగిచర్ల రామకృష్ణానగర్ లో గుట్కా తయారీ చేస్తున్న వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన ఖాదర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 15 లక్షల విలువైన నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 14 గుట్కా తయారీ యంత్రాలు, రూ. 13 వేల నగదు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఖాదర్ ఖాన్ రామకృష్ణానగర్ లో ఓ షెడ్ ఏర్పాటు చేసుకొని గుట్కా, తంబాకు ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో ఓ న్యూస్ ఛానల్ లోగో, కెమెరాను గుర్తించామని.. ఇన్నోవా కారుకు మీడియా స్టిక్కర్ అంటించి గుట్కా తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

Hyd Police Arrested Man due to Gutkha Manufacturing

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News