Friday, May 3, 2024

ఉద్యోగం ఆశతో బందీనయ్యా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉద్యోగం వస్తుందనే ఆశతో దుబాయ్‌కు వెళ్లిన హైదరాబాదీ యువతి తనను రక్షించాలని వేడుకుంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు అక్కడి నుంచే తన వాట్సాప్ సందేశం పంపించింది. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళ తనను హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు తీసుకువచ్చిందని తీరా ఇక్కడ మోసపోయ్యానని ఏ విధంగా అయినా తనను స్వస్థలం చేర్చి పుణ్యం కట్టుకోవాలని ఈ 48 ఏండ్ల మహిళ వాపోయింది. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతపు వాసి అయిన ఫరీదా బేగం తాను అక్రమ రవాణాకు గురయినట్లు ఆలస్యంగా గుర్తించింది.

దాదాపు 40 వేల రూపాయల జీతం ఉద్యోగం, మంచి బస, తిండి పలు సౌకర్యాలు ఉంటాయని నమ్మబలికారని తెలిపింది. గత ఏడాది నవంబర్ 4వ తేదీన ఫరీదా యుఎఇ వెళ్లింది. 30 రోజుల విజిటర్స్ వీసాతో వెళ్లిన ఆమెను మాయలేడి ఓ అరబ్ కుటుంబం ఇంటికి చేర్చింది. అక్కడ తన ఆరోగ్యం దెబ్బతిందని,తాను ఇంటి నుంచి వెళ్లకుండా పాస్‌పోర్టు లాక్కున్నారని తనను ఆదుకోవాలని అప్పీలు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News