Friday, May 10, 2024

సోరెన్ ఆచూకీపై సస్పెన్స్

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్
రాంచీ చేరుకున్న తరువాత మీడియాతో భేటీ
సోరెన్ ఆచూకీపై సస్పెన్స్

రాంచీ : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఆచూకీపై సస్పెన్స్ మధ్య రాంచీలో తన నివాసానికి తిరిగి వచ్చిన అనంతరం తాను ప్రజల గుండెల్లో నిద్రిస్తుంటానని చెప్పారు. జెఎంఎం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు కూడా అయిన హేమంత్ సోరెన్ పార్టీ ఎంఎల్‌ఎల సమావేశానికి అధ్యక్షత వహించారు. తాను నగరంలో లేకపోవడం గురించిన విలేకరుల ప్రశ్నకు సిఎం సమాధానం ఇస్తూ, ‘తాను మీ గుండెల్లో నివసిస్తుంటా’ అని చెప్పారు.

హేమంత్ సోరెన్ రాంచీలో బాపు వాటికలో మీడియాతో మాట్లాడారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించేందుకు సోరెన్ బాపు వాటికకు వెళ్లారు. ‘జాతి పిత అడుగులను, సిద్ధాంతాలను అనుసరించేందుకు మేము అంతా కట్టుబడి ఉన్నాం. అటువంటి వ్యక్తులు మన మధ్య జన్మించి మార్గదర్శనం చేయడం మనకు గర్వకారణం’ అని సోరెన్ అన్నారు. సోరెన్ ఈ నెల 27న న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

తన ఆచూకీకి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో సోరెన్ సోమవారం అర్ధరాత్రి రాంచీలోని తన అధికార నివాసానికి చేరుకున్నారు. తన నివాసంలో ఎంఎల్‌ఎలు, మంత్రుల సమావేశానికి సోరెన్ అధ్యక్షత వహించారు. ఆయన భార్య కల్పన సోరెన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఝార్ఖండ్ రాజధాని వదలి వెళ్లరాదని, సమావేశానికి హాజరు కావాలని జెఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి శాసనసభ్యులు అందరినీ కోరారు.

ప్రస్తుత పరిస్థితి, బుధవారం సిఎంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రశ్నించాలన్న ప్రతిపాదన విషయమై వ్యూహ రచన కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ‘ఝార్ఖండ్ సిఎంకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఆయనకు ఎవరూ హాని చేయలేరు. ద్రోహులను ఎదుర్కొనేందుకు మేము వ్యూహ రచన చేస్తున్నాం’ అని జెఎంఎం అధికార ప్రతినిధి మనోజ్ పాండే చెప్పారు. ఆయన అంతకు మించి వివరణ ఇవ్వలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News