Tuesday, April 30, 2024

నేటి నుంచే వరల్డ్ వార్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వన్డే ప్రపంచకప్‌నకు గురువారం తెరలేవనుంది. అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా మెగా టోర్నీ జరుగనుంది. అహ్మదా బాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెం డింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్న్న్రరప్ న్యూజిలాండ్ జట్లు తలపడ నున్నాయి. ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పోటీ పడనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు ప్రత్యర్థి టీమ్ ఒక్కో మ్యాచ్‌ను ఆడుతుంది.

వర ల్డ్‌కప్‌లో మొత్తం 45 లీగ్ మ్యాచ్‌లు, మరో మూడు నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ నవంబర్ 15న ముంబైలో, రెండో సెమీస్ నవంబర్ 16న కోల్‌కతాలో జరుగుతాయి. ఫైనల్ నవం బర్ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది. ఆతిథ్య భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌ల మధ్య అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో పోరు జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News