Wednesday, May 8, 2024

సమ్‌థింగ్ స్పెషల్ రోడ్ జర్నీ మూవీ

- Advertisement -
- Advertisement -

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్ దర్శకత్వంలో మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ అశ్విన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఈ సినిమాలో శ్రీకాంత్, భూమిక, తాన్య, నా పాత్రలకు ఒక్కో గోల్ ఉంటుంది.

అందరూ రోడ్ జర్నీ చేస్తూ ఎక్కడ కలుసుకున్నారు? ఆ జర్నీ అంతా ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యారా లేదా? అనేదే ఈ సినిమా కథ. తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువగా వచ్చాయి. అయితే ఈ చిత్రం సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. సినిమాలో 20 నిమిషాలు మంచు మీద రైడ్, రేస్ ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు గురు నేచురల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇక నా తదుపరి సినిమా ‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ కూడా పూర్తయింది” అని అన్నారు.

‘Idhe Maa Katha’ movie to release on Oct 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News