Friday, May 3, 2024

అత్యుత్తమ యూనివర్సిటీగా ఐఐఎస్‌సి బెంగళూరు: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత పురాతన విద్యా సంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు(ఐఐఎస్‌సి) దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఎంపికైంది.

భారతదేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) 2023 టాటా ప్రకారం ఐఐఎస్‌సి బెంగళూరు టాప్ టెన్ యూనివర్సిటీలలో అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో న్యూఢివల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యు) నిలిచింది. న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా మూడవ ర్యాంకు సాధించింది.

కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ 4వ ర్యాంకు సాధించగా, వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ 5వ ర్యాంకులో నిలిచింది. మణిపాల్‌లోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 6వ ర్యాంకులో నిలువగా కోయంబత్తూరులోని అమృత విశ్వ విద్యాపీళం 7వ ర్యాంకు సాధిచింది. వెల్లూరులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) 8వ స్థానంలో అలీగఢ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 9వ స్థానంలో నిలిచాయి.

హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ ర్యాంకు సాధించింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఐఐటి మద్రాసు వరుసగా 8వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఇన్నోవేషన్‌లకు సంబంధించి ఐఐటి కాన్పూర్ అగ్రస్థానంలో ఉండగా తరువాతి స్థానంలో ఐఐటి మద్రాసు, ఐఐటి హైదరాబాద్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News