Monday, April 29, 2024

డిగ్రీలపై విద్యార్థుల ఆధార్ నంబర్లను యూనివర్సిటీలు ముద్రించరాదు: యుజిసి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డిగ్రీలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై విద్యార్థుల ఆధార్ నంబర్లను ముద్రించడానికి వీల్లేదని యూనివర్సిటీలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) ఆదేశించింది.

ఉద్యోగ నియమాకాలు లేదా ఉన్నత విద్య ప్రవేశాల సమయంలో పత్రాల పరిశీలన సులభతరం చేసేందుకు విద్యార్థుల పూర్తి అధార్ నంబర్లను ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, డిగ్రీలపై ముంద్రించడానికి యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో యుజిసి నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి.

నిబంధనల ప్రకారం ఆధార్ నంబర్‌ను ఎట్టి పరిస్థితులలో బహిర్గతం చేయడానికి వీల్లేదని యూనివర్సిటీలకు రాసిన లేఖలో యుజిసి కార్యదర్శి మనీష్ జోషి పేర్కొన్నారు. డిగ్రీలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లను ముద్రించడాన్ని అనుమతించబోమని ఆయన తెలిపారు. యుఐడిఎఐ(ఆధార్) నిబంధనలకు ఉన్నత విద్యా సంస్థలు పూర్తిగా కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News