Wednesday, May 15, 2024

చోరీ చేసిన బొగ్గుతో అక్రమ వ్యాపారం

- Advertisement -
- Advertisement -

Illegal trade with stolen coal CBI probes in 4 states

 

4 రాష్ట్రాలలో సిబిఐ సోదాలు

న్యూఢిల్లీ: ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్(ఇసిఎల్)కు చెందిన కొందరు ఉన్నతాధికారులతో కుమ్మక్కై బొగ్గు చోరీకి పాల్పడిన ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసిన సిబిఐ అధికారులు శనివారం నాలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 45 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ సోదాలు జరుపుతున్నట్లు సిబిఐ అధికారులు శనివారం తెలిపారు. ఇసిఎల్‌కు చెందిన ఇద్దరు జనరల్ మేనేజర్లు, ముగ్గురు భద్రతా సిబ్బందితో అనూప్ మాంఝి అనే వ్యక్తి కుమ్మక్కై భారీ స్థాయిలో బొగ్గు చౌర్యానికి పాల్పడినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. అనూప్ మాంఝితో పాటు గుర్తు తెలియని కొందరు ఇసిఎల్, రైల్వే, సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లు వారు చెప్పారు. కునుస్తోరియా, కజోరా ప్రాంతాలలోని ఇసిఎల్ బొగ్గు గనుల నుంచి అక్రమంగా బొగ్గు తవ్వకాలు చేపట్టి, వాటిని చౌర్యం చేసినట్లు మాంఝి అలియాస్ లాలాపై సిబిఐ కేసులు నమోదు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News