Monday, April 29, 2024

వరుసగా 9వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol and Diesel prices rose for ninth day in row

 

న్యూఢిల్లీ: గడచిన తొమ్మిది రోజులుగా వరుసగా పెరుగుతున్న ధరలతో శనివారం లీటరు పెట్రోల్ ధర రూ. 82 దాటగా డీజిల్ ధర రూ. 72 దాటింది. శనివారం లీటరు పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 82.13కు చేరుకుంది. డీజిల్ ధర రూ. 72.13కు పెరిగింది. దాదాపు రెండు వారాల విరామం తర్వాత చమురు కంపెనీలు రోజువారీ ధరల సవరణ చేపట్టడంతో నవంబర్ 20 నుంచి వరుసగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలలో పెరుగుదల ఉంటోంది. గత తొమ్మిది రోజులలో లీటరు పెట్రోల్‌పై రూ. 1.07, డీజిల్‌పై రూ. 1.67 పెరుగుదల ఉంది. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 88.81, డీజిల్ ధర రూ. 78.66కు పెడిరిగింది. స్థానిక పన్నులు లేదా వ్యాట్ వల్ల వివిధ రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News