Tuesday, April 30, 2024

యుద్ధం భయాలతో నష్టాలు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 66,000 పాయింట్ల దిగువకు ఇది పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్ల దిగువకు పడిపోయి 65,877 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 19,671 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ రంగ షేర్లలో భారీ పతనం కారణంగా మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితమైంది.

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల షేర్లలో క్షీణత నెలకొంది. బ్యాంక్ నిఫ్టీ 520 పాయింట్ల పతనంతో 43,888 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది కాకుండా ఐటి, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, రియల్ ఎస్టేట్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు క్షీణతతో ముగిశాయి. హెల్త్‌కేర్, ఫార్మా, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కూడా క్షీణత కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 4 మాత్రమే లాభపడగా, 26 నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ పతనం కారణంగా ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.321.39 లక్షల కోట్లకు తగ్గింది. అంతకుముందు రోజు ఇది రూ.323.80 లక్షల కోట్లుగా ఉంది. అంటే బుధవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు రూ.2.40 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.

బజాజ్ ఆటో లాభం 17 శాతం జంప్
క్యూ2 (జులై సెప్టెంబర్) ఫలితాల్లో బజాజ్ ఆటో నికర లాభం రూ.2,020 కోట్లతో 17.48 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో బజాజ్ ఆటో లాభం రూ.1,719 కోట్లుగా ఉంది. క్యూ1 ఫలితాలతో పోలిస్తే ఈ లాభం 23 శాతం పెరిగింది. బజాజ్ ఆటో ఆపరేషన్స్ నుంచి ఆదాయం గతేడాదిలో రూ. 10,202 కోట్ల నుంచి రూ.10,838 కోట్లకు పెరిగింది, అంటే వార్షికంగా 6.22 శాతం వృద్ధిని సాధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News