Wednesday, May 15, 2024

శిక్షణా తరగతులతో నర్సుల వృత్తి నైపుణ్యం మెరుగు : బి. నాగేందర్

- Advertisement -
- Advertisement -

గోషామహల్: నర్సుల వృత్తి నైపుణ్యాన్ని మరింతగా మెరుగు పర్చుకునేందు కు వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్, ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఎం. రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి స్వరాజ్య వాణిలు పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ కాన్ఫెరెన్స్ హాల్‌లో గత 7 రోజులుగా ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇం డియా సౌజన్యంతో కొనసాగిన నర్సుల వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులు నేటితో ముగిసాయి. శిక్షణా తరగతుల ముగింపు కాక్యక్రమానికి వా రు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన కంటిన్యూయస్ నర్సింగ్ ఎడ్యుకేషన్ (సీఎస్‌ఈ) కార్యక్రమం ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజానంలో నర్సులు తమ నైపుణ్యతను పెంపొందించుకుని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు ఎంతో అవసరమని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి శిక్షణా తరగతులు మరింత విస్త్రతంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్య క్షురాలు డాక్టర్ ఎం రాజేశ్వరి అడ్వాన్స్‌మెంట్ ఇన్ నర్సింగ్ అనే అంశంపై న ర్సులకు అవగాహన కల్పించి, పలువురు న ర్సుల సందేహాలను నివృత్తి చేశారు. వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులతో ఆసుపత్రి నర్సులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, అనేక విషయాలను తెలుసుకున్నారని తెలిపారు. ఈ కార్య క్ర మంలో ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ టీమ్ శిరీషా రాణి, వనిలా, సుజాత, క్యారోలిన్, హేమలత, సౌ మ్యశ్రీ, హరిత తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News