Monday, April 29, 2024

ఎడతెరిపిలేని వర్షం.. యాదాద్రిలో భక్తుల ఇక్కట్లు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో వచ్చే భక్తులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులు యాదగిరిగుట్ట బస్టాండ్ నుండి దేవస్థానం బస్టాండ్ వరకు సరైన రవాణ సౌకర్యం లేక వర్షంలో ఎలా వెళ్లాలో కూడా తెలియక తడుస్తూ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయి ంచడమే కాకుండా, నడుచుకుంటూ వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవస్థానం బస్టాండ్ నుండి కొండపైకి వెళ్లందుకు కూడా భ క్తులకు అగచాట్లు తప్పలేదు.

కొండపైకి స్వామివారి దర్శనానికి చేరుకున్న భక్తులకు ఎడతెరిపిలేని వర్షంతో తడిసి ముద్దై ఇబ్బందులు పడుతూనే స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులకు వర్షంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. కొండపైన ప్రసాద కౌంటర్, ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుకోవడంతో కూడా భక్తులతో పాటు ఆలయ ఉద్యోగ, సిబ్బంది కూడా ఇబ్బందిపడక తప్పలేదు.

భక్తుల రద్దీ సాధారణం..
లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వర్షాల కారణంగా గురువారం భక్తుల రద్దీ తగ్గింది.
గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అభిషేకం, అర్చన, సుదర్శన నారసింహ హోమం, స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవం, సువర్ణ పుష్పార్చన, వెండి జోడి సేవ, దర్బార్ సేవతో పాటు ప లు నిత్యకైంకర్య పూజలను అర్చకులు నిర్వహించారు.

స్వామివారి నిత్యపూజల్లో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. కొండపైన కొలువుదీరిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు దర్శించుకున్నారు. కొండ కిందగల అనుబంధ ఆలయమైన శ్రీపాత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి…
లక్ష్మీనరసింహస్వామి వారి నిత్యరాబడి రూ.9,80,740 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్, వీఐపీ దర్శనం , బ్రేక్ దర్శనం, వీఐపీ దర్శనం, ప్రసాద విక్రయం, కొండపైకి వాహన ప్రవేశంతో పాటు వివిధ శాఖల నుంచి స్వామివారికి నిత్యరాబడి చేకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

స్వామివారిని దర్శించుకున్నపలువురు ప్రముఖులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అరుణ్‌కుమార్ జైన్, ఏకే గుప్తాకు అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News