Sunday, May 5, 2024

చెలరేగిన రాహుల్, రోహిత్.. టీమిండియాకు సిరీస్‌కు

- Advertisement -
- Advertisement -

IND beat NZ with 7 wickets in 2nd T20

రాంచీ: న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టాని 153 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 17.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్ శర్మ శుభారంభం అందించారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోహిత్ వరుస సిక్సర్లతో అలరించగా, రాహుల్ బౌండరీలతో కనువిందు చేశాడు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ పటిష్టస్థితికి చేరుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 49 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 36 బంతుల్లో ఐదు భారీ సిక్సర్లు, ఒక బౌండరీతో 55 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక సూర్యకుమార్(1) నిరాశ పరిచాడు. ఈ మూడు వికెట్లు కూడా సౌథికే దక్కాయి. కాగా, రిషబ్ పంత్ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడంతో భారత్ మరో 16 బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. రిషబ్ 12, వెంకటేశ్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
కట్టడి చేశారు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించాడు. చెలరేగి ఆడిన గుప్టిల్ 15 బంతుల్లోనే మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మిచెల్ మూడు పోర్లతో 31 పరుగులు సాధించాడు. గ్లెన్ ఫిలిప్స్ (34) కూడా ధాటిగా ఆడాడు. అయితే కీలక సమయంలో భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో కివీస్ స్కోరు 153 పరుగులకే పరిమితమైంది. ఆరంగేట్రం బౌలర్ హర్షల్ పటేల్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. అక్షర్, అశ్విన్ కూడా రాణించారు.

IND beat NZ with 7 wickets in 2nd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News