Sunday, April 28, 2024

టీమిండియాకు పరీక్ష

- Advertisement -
- Advertisement -

టీమిండియాకు పరీక్ష.. నేటి నుంచి రెండో టెస్టు
జోరుమీదున్న ఇంగ్లండ్

ఇంగ్లండ్‌తో శనివారం ఆరంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ ఆతిథ్య టీమిండియాకు కీలకంగా మారింది. ఇప్పటిaకే తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన విరాట్ కోహ్లి సేనకు ఈ టెస్టు పరీక్షగా తయారైంది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇందులో విజయం సాధించక తప్పదు. అంతేగాక ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలువాలంటే కూడా ఇందులో గెలవడం తప్పించి మరో మార్గం టీమిండియాకు లేకుండా పోయింది. ఇలాంటి స్థితిలో భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో జో రూట్ జోరుమీదున్నాడు.

చెన్నై: ఇంగ్లండ్‌తో శనివారం ఆరంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ ఆతిథ్య టీమిండియాకు కీలకంగా మారింది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన విరాట్ కోహ్లి సేనకు ఈ టెస్టు పరీక్షగా తయారైంది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇందులో విజయం సాధించక తప్పదు. అంతేగాక ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలువాలంటే కూడా ఇందులో గెలవడం తప్పించి మరో మార్గం టీమిండియాకు లేకుండా పోయింది. ఇలాంటి స్థితిలో భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో జో రూట్ జోరుమీదున్నాడు. ఇక తొలి మ్యాచ్‌లో జేమ్స్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. జాక్ లీచ్ కూడా దూకుడు మీద ఉన్నాడు. డామ్ బెస్ కూడా తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఈసారి కూడా బౌలర్లపై ఇంగ్లండ్ భారీ నమ్మకంతో ఉంది. వారు రాణిస్తే ఈసారి కూడా గెలవడం ఇంగ్లండ్‌కు కష్టం కాకపోవచ్చు. అయితే తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్, షైబాజ్ నదీమ్‌లకు తుది జట్టులో చోటు కల్పిస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు.
రోహిత్ ఈసారైన
తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈసారైన తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ వైఫల్యం తొలి మ్యాచ్‌లో టీమిండియాను వెంటాడింది. కీలకమైన రెండో టెస్టులో రోహిత్ చెలరేగక తప్పదు. అతను విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు మంచి ఆరంభం లభించడం ఖాయం. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా నిలకడగా ఆడాల్సిన అవసరం నెలకొంది. ఇద్దరు కలిసి శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే వారిపై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.
ఇద్దరిపైనే భారం
ఈ మ్యాచ్‌లో సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు జట్టుకు చాలా కీలకంగా మారారు. తొలి టెస్టులో రహానె రెండు ఇన్నింగ్స్‌లలో కూడా విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. పుజారా తొలి ఇన్నింగ్స్‌లో రాణించినా రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. జట్టుకు ఎంతో కీలకంగా మారిన రెండో టెస్టులో ఇటు రహానె, అటు పుజారా స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. ఇద్దరు రాణిస్తేనే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు తీరుతాయి. రహానెకు ఈ మ్యాచ్ సవాలుగా తయారైంది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కూడా రహానె నిరాశ పరిచాడు. దీంతో అతని బ్యాటింగ్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో రెండో టెస్టు అతనికి చాలా కీలంగా తయారైంది.
కోహ్లి మెరవాలి
కిందటి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి బాగానే ఆడాడు. అతను ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభపరిణామంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో జట్టు విరాట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. విరాట్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే టీమిండియాకు భారీ స్కోరు సాధించడం నల్లేరుపై నడకే. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా తన జోరును కొనసాగించాలి. తొలి టెస్టులో పంత్ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. అశ్విన్ కూడా తనవంతు పాత్ర పోషిస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కాస్త తగ్గుతాయి.
రూట్‌ను కట్టడి చేస్తేనే
ఇక తొలి టెస్టులో డబుల్ సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఈసారి కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. అతన్ని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్ పంపించాల్సిన అవసరం ఎంతైన ఉంది. రూట్‌ను కట్టడి చేస్తే ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయడం కష్టమేమీ కాదు. రూట్ విజృంభిస్తే మాత్రం ఈసారి కూడా టీమిండియాకు కష్టాలు ఖాయమని చెప్పాలి. బెన్‌స్టోక్స్, డొమినిక్ సిబ్లి, లారెన్స్, రోరి బర్న్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే అండర్సన్, లీచ్, బెస్ వంటి బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం.

IND v ENG 2nd Test from Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News