Sunday, April 28, 2024

హోరాహోరీ ఖాయం

- Advertisement -
- Advertisement -

నేడు లంక-భారత్ తొలి టి20

కొలంబో: చివరి వన్డేలో భారత్‌పై అద్భుత విజయం సాధించిన ఆతిథ్య శ్రీలంక జట్టు ఆదివారం జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు ఆఖరి మ్యాచ్‌లో లంక చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవడమే కాకుండా టి20 సిరీస్‌లో శుభారంభం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. రెండు జట్లలోనూ యువ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. వన్డేల్లో సిరీస్ గెలిచిన టీమిండియా ఈసారి ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో విఫలమైంది. పూర్తి ఓవర్లపాటు బ్యాటింగ్ చేయలేక పోయింది. కెప్టెన్ శిఖర్ ధావన్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక సీనియర్ ఆటగాడు మనీష్ పాండే కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లో అతనికి అవకాశం లభిస్తుందా లేదా అనేది సందేహమే. కాగా, యువ ఓపెనర్ పృథ్వీషా ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. షా విజృంభిస్తే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. అయితే కెప్టెన్ ధావన్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తదితరులతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు శ్రీలంకను కూడా తక్కువ అంచన వేయలేం. కిందటి మ్యాచ్‌లో లంక అద్భుత విజయాన్ని అందుకుంది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. నిలకడగా రాణిస్తున్న లంకను ఓడించాలంటే టీమిండియా అసాధారణ ఆటను కనబరచక తప్పదు. ఏ మాత్రం నిర్లక్షంగా ఆడినా ఫలితం ప్రతికూలంగా రావడం ఖాయం.

IND vs SL First T20 Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News