Tuesday, April 30, 2024

భారత మహిళలకు తొలి గెలుపు

- Advertisement -
- Advertisement -

India beat Ireland by 10 goals

 

టోక్యో: మహిళల హాకీలో భారత్ తొలి విజయం నమోదు చేసింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన భారత్ ఎట్టకేలకు మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఆసక్తికరంగా సాగిన పోరులో భారత్ 10 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు కూడా గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే గోల్స్ సాధించడంలో మాత్రం విఫలమయ్యాయి. ప్రథమార్ధంలో రెండు జట్లు ఒక్క గోల్‌ను కూడా నమోదు చేయలేక పోయాయి. భారత్‌కు పలుసార్లు గోల్ చేసే అవకాశం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఇక ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా నవ్‌నీత్ కౌర్ ఏకైక గోల్‌ను నమోదు చేసింది. దీన్ని చివరి వరకు కాపాడుకున్న భారత్ 10తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News