Saturday, May 4, 2024

మూడో టి-20లో ఆసీస్ విజయం… సిరీస్ భారత్‌దే

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: మూడో టి-20లో భారత్ ఘోర పరాజయంపాలైనప్పటికి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 12 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 186 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులే చేసింది. ఆసీస్ ఓపెనర్ వాడే (80) ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా జట్టు మంచి స్కోర్ సాధించింది. మ్యాక్స్‌వెల్ చివరలో మెరుపులు మెరిపించాడు. మ్యాక్స్ వెల్ 36 బంతుల్లో 54 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. భారత్ బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ (85) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు సహకారం అందించకపోవడంతో టీమిండియా ఓటమిని చవిచూసింది. శిఖర్ ధావన్(28), హర్ధిక్ పాండ్యా(20), సంజూ శామ్సన్(10) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో మైదానం వీడారు. ఆస్ట్రేలియాలో బౌలర్లలో స్విప్సన్ మూడు వికెట్లు తీయగా ఆబాట్, టై, జంపా, మ్యాక్స్‌వెల్ తలో ఒక వికెట్ తీశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టగా నటరాజన్, శార్థూల్ టాగూర్ చెరో ఒక వికెట్ తీశారు. మూడు వికెట్లు తీసిన సింప్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఈ సిరీస్ లో దిగ్విజయంగా రాణించిన హార్ధిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News