సిడ్నీ: టి-20లో ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలాంటి ఫినిషర్ కావాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. మ్యాచ్ ఫినిషర్ లేకపోతే ఎంత జట్టుకైనా ప్రయోజనం ఉండదని ఆసీస్ జట్టుకు హితబోధ చేశాడు. అక్టోబర్‌లో జరగబోయే టి-20 ప్రపంచకప్‌లో ఆసీస్ విజయ అవకాశాలపై పాంటింగ్ స్పందించాడు. వికెట్ కీపింగ్ చేయడంతో పాటు చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేసే ఆటగాడు ఆసీస్ జట్టులో లేడని, అదే మైనస్ పాయింట్ అని చురకలంటించాడు. చివరి ఓవర్లలో ధోనీ, పాండ్యా, పొలార్డ్‌లాంటి ఆటగాళ్లు వేగంగా ఆడడంతో ఆ జట్లకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియాలో జట్టులో వార్నర్, ఫించ్, మ్యాక్స్‌వెల్ లాంటి భారీ హిట్టర్స్ ఉన్నప్పటికి ఈ ఆటగాళ్లు టాపార్డర్ లో ఆడుతున్నారు. గతంలో గిల్‌క్రిస్ట్‌లాంటి భారీ హిట్టింగ్ చేయడంతో విజయ అవకాశాలు ఆసీస్‌కు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు అలాంటి కీపర్లు జట్టులో లేరని విచారం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టులో మాథ్యూ వేడ్, ఫిలిప్, అలెక్స్ క్యారీలు లాంటి వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్లు ఉన్నప్పటికి ఈ ముగ్గురులో ఎవరిని ఎప్పుడు తీసుకుంటారో అర్థం కావడం లేదని జట్టు మేనేజ్‌మెంట్‌ను దుయ్యబట్టారు.