Friday, April 26, 2024

శ్రీలంకకు 5 లక్షల వ్యాక్సిన్ డోసులు భారత్ బహూకరణ

- Advertisement -
- Advertisement -

India donates 5 lakh vaccine doses to Sri Lanka

 

స్వీకరించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స

కొలంబో : పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం అన్న విధానం కింద భారత్ బహూకరించిన 5,00,000 కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స గురువారం స్వీకరించారు. ప్రత్యేక విమానంలో 42 బాక్సుల్లో వచ్చిన ఈ వ్యాక్సిన్ డోసులను కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా భారత రాయబారి గోపాల్ బగ్లే అధ్యక్షుడు రాజపక్సను అనుసరించారు. శ్రీలంకను బుద్ధుడు మొదటిసారి సందర్శించిన రోజు పోయాడే సందర్బంగా ఈ వ్యాక్సిన్‌ను అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా భారత హైకమిషనర్ గంగారామయ్య ఆలయంలో శ్రీలంక ప్రజల ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. శ్రీలంకలో ఆరు ఆస్పత్రుల్లో శుక్రవారం నాడు వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. మొత్తం 2,50,000 మందిలో హెల్తు ఫ్రంట్‌లైన్ వర్కర్లు, సెక్యూరిటీ బలగాలు, పోలీస్ దళాలు, వయోవృద్ధులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇస్తారు. భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌కు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 3 మిలియన్ డోస్‌ల ఆర్డరును ఈ వారం శ్రీలంక ఫార్మాక్యూటికల్ కార్పొరేషన్ ఇవ్వనున్నట్టు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News