Monday, May 6, 2024

సెమీస్‌లో భారత్

- Advertisement -
- Advertisement -

Asian badminton

 

మనీలా: ప్రతిష్టాత్మకమైన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 32 తేడాతో థాయిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాళ్లు సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్‌లు ఓటమి పాలయ్యారు. దీంతో థాయిలాండ్ 20 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సెమీస్‌కు చేరడం క్లిష్టంగా మారింది. కానీ, కీలకమైన పురుషుల డబుల్స్ విభాగంలో ఎం.ఆర్. అర్జున్ ధ్రువ్ కపిల జోడీ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో అర్జున్ జంట 2118, 2220 తేడాతో కిటునుపాంగ్ విరియంగ్‌కురా జంటను ఓడించింది. ఇరు జోడీలు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడాయి.

కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జున్ జోడీ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తర్వాత జరిగిన మూడో సింగిల్స్‌లో యువ సంచలనం లక్షసేన్ చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో లక్షసేన్ 2119, 2118తో థాయిలాండ్ ఆటగాడు సుపన్యను ఓడించాడు. ఈ విజయంతో భారత్ 22తో స్కోరును సమం చేసింది. ఇక, ఫలితాన్ని తేల్చే చివరి డబుల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ చిరాగ్ శెట్టి జంట విజయం సాధించింది. హోరాహోరీ సమరంలో శ్రీకాంత్ జంట 2115, 1621, 2115తో జాంగ్‌జిట్‌నిపిపాన్ జోడీని ఓడించింది. ఈ గెలుపుతో భారత్ 32తో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది.

India in Asian badminton championship semis
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News