Friday, May 3, 2024

జడ్జిల ఖాళీల సంఖ్య 69,600

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు మొత్తం మీద 69,600 మంది జడ్జిల అవసరం ఉంది. ఇప్పుడున్న న్యాయమూర్తుల సంఖ్య 25,081. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వెలువరించిన నేటి న్యాయవ్యవస్థ తాజా నివేదికలో వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక్కటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉండాల్సిన 34 మంది న్యాయమూర్తులతో ఉంది. 36 సంవత్సరాల క్రితం అప్పటి లా కమిషన్ ప్రతి పది లక్షల మందికి కనీసం 50 మంది వంతున అయినా జడ్జిలు వివిధ స్థాయిల కోర్టులలో ఉండాల్సి ఉందని తెలిపింది. అప్పటికీ ఉన్న జడ్జిల నిష్పత్తి కేవలం పది లక్షల మందికి కేవలం పది మంది జడ్జిలు.

ఇన్ని సంవత్సరాలు అయినా న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ మందకొడిగా ఉంటోంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో జడ్జిల కొరత ఉంది. తరువాతి స్థానంలో బీహార్ ఉంది. దీనితో ఆయా రాష్ట్రాలలో నిర్ణీత క్రమంలో కేసుల పరిష్కారం సంబంధిత విచారణలు జరగడం లేదు. ప్రత్యేకించి జిల్లా స్థాయిల్లో జడ్జిల కొరత ఎక్కువగా ఉంది. ఎప్పటికప్పుడు తగు విధంగా పరిశీలించుకుని జడ్జిల భర్తీ జరగాల్సి ఉంటుంది. లేకపోతే వచ్చిపడే వ్యాజ్యాలకు , విధులలో ఉండే న్యాయమూర్తుల సంఖ్యకు పొంతన లేకుండా పోతుందని నివేదికలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News