Wednesday, May 8, 2024

ఈ నెల 14న చంద్రయాన్ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగం ఈ నెల 14వ తేదీన జరుగుతుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారులు గురువారం ప్రధాన కేంద్రం నుంచి ప్రకటించారు. ఇంతకు ముందు ఈ ప్రయోగం ఈ నెల 13వ తేదీన ఉంటుందని తెలిపారు. అయితే ఒక్కరోజు ఆలస్యంగా ప్రయోగం చేపట్టడానికి దారితీసిన కారణాలను వెల్లడించలేదు. ఈ చంద్రుడిపైకి భారతీయ అంతరిక్ష యాత్రలో ఈ ప్రయోగం కీలక ఘట్టంగా ఉంటుంది. చంద్రుడిపై రోవర్‌ను విజయవంతంగా దింపేందుకు ఇస్రో చేస్తున్న మూడో దఫా ప్రయత్నం ఇది .

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని పరీక్షిస్తారు. ఇస్రోకు చెందిన నూతన నిర్మిత వాహకనౌక ఎల్‌విఎం 3 ద్వారా ప్రయోగం ఉంటుంది. దీనికి అవసరం అయిన క్యాప్సూల్స్, ఇతరత్రా శాస్త్రీయ పరికరాల అనుసంధాన ఏర్పాట్లు విజయవంతం అయ్యాయి. ఈ నెల 14న ప్రయోగం జరుగుతుందని ఇస్రో తమప్రకటనలో తెలిపింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు పరీక్ష ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News