Wednesday, May 8, 2024

గిన్నిస్ బుక్‌లో భారత్ పులుల జనాభా గణన

- Advertisement -
- Advertisement -

Indian's 2018 tiger census in Guinness world Record

న్యూఢిల్లీ: దేశంలో కెమెరా సాయంతో అడవులలో 2018లో నిర్వహించిన పులుల జనాభా గణన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2018 ప్రకారం దేశంలో 2,967 పులులు లేదా ప్రపంచ పులుల జనాభాలో 75 శాతం మన దేశంలోనే ఉన్నాయి. పులుల జనాభా గణన ఫలితాలను ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది ప్రపంచ పులుల దినోత్సవం నాడు ప్రకటించారు.భారతదేశంలో పులుల జనాభా గణన ప్రక్రియ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం పట్ల కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావదేకర్ హర్షం వ్యక్తం చేశారు. కెమెరా సాయంతో ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి జనాభా గణనగా మనదేశం గిన్నిస్ బుక్‌లో స్థానం పొందడం గొప్ప విషయమని, ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక గొప్ప ఉదాహరణని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో పులుల సంఖ్యను రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని నాలుగేళ్ల ముందుగానే సంకల్ప్ సే సిద్ధితో సాధించామని ఆయన చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెబ్‌సైట్ తెలిపిన ప్రకారం 2018-19లో నిర్వహించిన నాలుగవ విడత సర్వే గణాంకాల విషయంలో అత్యంత సమగ్రమైనది. దేశంలోని 141 వేర్వేరు అడవులలో ఏర్పాటు చేసిన 26,838 కెమెరా ట్రాప్‌లు(జంతువు కదలిక మేరకు రికార్డింగ్ మొదలయ్యే మోషన్ సెన్సార్లు అమర్చిన కెమెరాలు) మొత్తం 1,21,337 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కవర్ చేశాయని వెట్‌సైట్ తెలిపింది. మొత్తం 3,48,58,623 ఫోటోలను కెమెరా ట్రాప్‌లు క్లిక్ చేశాయని తెలిపింది. పులుల మీద ఉన్న చారల ఆధారంగా మొత్తం 2,461 పులులను గుర్తించడం జరిగిందని తెలిపింది.

Indian’s 2018 tiger census in Guinness world Record

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News