Saturday, April 27, 2024

సమీప కాలంలో సవాళ్లు

- Advertisement -
- Advertisement -

సమస్యలను భారత్ పరిష్కంచుకోగలదు
ఇప్పటికీ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నాం: ఆర్థిక మంత్రిత్వశాఖ

 Inflation deficit in India

న్యూఢిల్లీ : ద్రవ్య లోటు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖా లోటు, ద్రవ్యోల్బణం కట్టడి చేసే ప్రయత్నంలో సమీప కాలంలో భారతదేశం సవాళ్లను ఎదుర్కోనుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ భారత్ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉందని ప్రభుత్వం తెలిపింది. నెలవారీ ఆర్థిక నివేదికలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ విషయాలను వెల్లడించింది. కష్టపడి సాధించిన స్థూల ఆర్థిక గణాంకాల స్థిరత్వం కోసం రాజీపడకుండా సమీప కాలంలో సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నాయి. అయితే వాటితో పోలిస్తే భారత్ సమస్యలను పరిష్కరించుకునే సామర్థం కల్గివుందని, ఎందుకంటే ఆర్థిక రంగ స్థిరంగా ఉండడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియం విజయవంతంగా నిర్వహించడమే అని ఆర్థిక సమీక్ష పేర్కొంది. సమీప భవిష్యత్‌లో భారత్ వృద్ధి ప్రకాశవంతంగా ఉంటుందని నివేదిక తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం బడ్జెట్ వృద్ధి ఊతమిస్తుందని చెబుతూ, పెట్రోల్, డీజిల్‌కు ఎక్సైజ్ సుంకాలు తగ్గించిన నేపథ్యంలో స్థూల ఆర్థిక లోటు స్థాయికి ముప్పు పెరిగింది. కరెంట్ ఖాతా లోటు పెరిగిన కారణంగా ద్రవ్యలోటు పెరిగి దిగుమతులు మరింత భారంగా మారుతున్నాయి. రూపాయి విలువ బలహీన కూడా లోటును పెంచుతోందని నివేదిక వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News