Tuesday, May 7, 2024

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన

- Advertisement -
- Advertisement -

ఎస్‌ఐఎస్ యాప్ ద్వారా వివరాలు సేకరించిన విద్యాశాఖ

తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పైకప్పులు మరమ్మతులు చేయాలన్న సిబ్బంది

కరోనా కారణంగా మూసివేతతో శిథిలంగా కనిపిస్తున్న బడులు

త్వరలో నిధులు కేటాయిస్తామంటున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు

Infrastructure arrangements in government schools

మన తెలంగాణ/ సిటీబ్యూరో: నగరంలో వచ్చే నెల నుంచి బడులు తెరవాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తుండటంతో అందుకోసం సర్కార్ బడుల్లో విద్యార్థు లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగిన వసతు లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ఏ స్కూల్‌లో ఏవసతులు ఏర్పాటు చేయాలో అం శాలపై స్కూల్ ఇన్‌ఫ్రా స్టేటస్ అనే యాప్‌ను ప్రవేశపె ట్టి, దీని ద్వారా పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయలు, ఉపాధ్యాయులను ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని కావాల్సిన వసతులను ఎస్‌ఐఎస్ యా ప్‌లో నమోదు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 690 స్కూల్స్ ఉండగా వీటిలో 492 ప్రాథమిక, 08 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలుండగా 1, 05, 210మంది విద్యార్థులు విద్యనభ్యస్తిన్నారు. వీటిలో అ న్ని వసతులుంటే కొత్త విద్యార్దులు చేరేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పటికే ప్రభుత్వం బడులుంటే ప్రజల్లో చిన్నచూపు ఉందని, పేదల చదువుకునే స్కూళ్లుగా భా విస్తారు. భవిష్యత్తులో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్ర భుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనే లక్షంతో సిఎం కెసిఆర్ రూ. 2వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆదిశగా ముందుకు వెళ్లుతూ ప్రత్యక్ష పాఠాలు ప్రారంభమయ్యేనాటికి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, బెంచీలు, గోడలు, పైకప్పుకు సంబంధించిన పనులు చే సి విద్యార్థులను ఆకట్టుకునేలా చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశించడంతో స్కూల్‌కు ఎలాంటి వసతులు కావాల్లో వివరాలు సేకరించి, యాప్‌లో పొం దుపరచడంతో అధికారులు వాటికి ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని నిధులు కేటాయించాలో వంటి విషయాలపై ఉన్నతాధికారులు చర్చించి త్వరలో విడుదల చేస్తామంటున్నారు. యాప్‌లో పాఠశాలల సిబ్బంది అందుబాటులో ఉంచి వివరాల ప్రకారం 264 స్కూల్స్‌కు తా గునీరు, గోడలకు సున్నం, మరుగుదొడ్లు సక్రమంలేని వాటిని ఏర్పాటు చేయాలని, భవనం పై కప్పు పెచ్చులూడుతునవి 140 వరకు ఉన్నట్లు, 105 పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేదని, విద్యార్దులు కూర్చొవడానికి బెంచీలు, బ్లాక్ బోర్డులు కావాల్సిన స్కూల్ 187 ఉన్న ట్లు గుర్తించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి స్కూల్స్ మూతపడటంతో గతంలో విద్యార్దులు ఉపయోగించిన పలు రకాలు పరికరాలు నాణ్యత లేకుండా పోయాయని, దీంతో దాదాపు అన్ని స్కూల్‌కు ఏదో ఒ క సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని మండల విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News