Sunday, May 5, 2024

పొట్టి కికెట్‌పై కరోనా పంజా

- Advertisement -
- Advertisement -

Nurse approached A Player for betting during IPL 2020

 ముంబై: ఊహించిందే జరిగింది.. కరోనా దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. పలు జట్ల క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఐపిఎల్‌ను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీని వాయిదా వేస్తున్న విషయాన్ని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఇక టోర్నమెంట్‌ను తిరిగి ఎప్పుడూ నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదిలావుండగా పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడుతుండడంతో తాజా పరిస్థితులను చర్చిచేందుకు బిసిసిఐ, ఐపిఎల్ పాలక మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. ఇందులో ఈ సమావేశంలో ఐపిఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ఐపిఎల్ సీజన్‌ను వాయిదా వేయడమే మంచిద నే నిర్ణయానికి వచ్చామని బిసిసిఐ స్పష్టం చేసింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భద్రత కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, దీంతో టోర్నీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోక తప్పలేదని బోర్డు వివరించింది. పరిస్థితులు కుదుట పడిన తర్వాతే ఐపిఎల్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయమని బోర్డు అధికారులు పేర్కొన్నారు.
ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం..
మరోవైపు వాయిదా పడిన ఐపిఎల్ టోర్నీని ఎప్పుడూ నిర్వహిస్తారనేది ఇంకా తేలలేదు. పరిస్థితులను గమనిస్తే సమీప భవిష్యత్తులో ఐపిఎల్ జరగడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఇప్పటికిప్పుడూ ఐపిఎల్‌ను నిర్వహించే సాహసానికి బిసిసిఐ పోతుందని భావించడం అత్యాశే అవుతోంది.కాగా కొన్ని రోజులుగా ఐపిఎల్ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఐపిఎల్‌ను నిర్వహించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అంతేగాక అంతర్జాతీయంగా కూడా ఐపిఎల్ నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి స్థితిలో ఐపిఎల్‌ను ఇప్పటికిప్పుడూ నిర్వహించేందుకు బిసిసిఐ ముందుకు రాక పోవచ్చు.
మంచి నిర్ణయం..
మరోవైపు ఐపిఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయడాన్ని పలువురు స్వాగతించారు. కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తున్న ప్రస్తుత తరుణంలో టోర్నీని వాయిదా వేయడమే మంచిదని, ఈ నిర్ణయం తీసుకున్న బిసిసిఐని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. భారత మాజీ క్రికెట్ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలతో పాటు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్, దీప్‌దాస్ గుప్తా, మురళీ కార్తీక్ తదితరులు ఐపిఎల్‌ను వాయిదా వేయడాన్ని స్వాగతించారు. సందర్భోచితంగా సరైన నిర్ణయం తీసుకున్న బిసిసిఐపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.

తప్పనిసరిపరిస్థితుల్లోనే..

ఈ సందర్భంగా ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక వార్త సంస్థతో మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఐపిఎల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. బయోబుల్ విధానంలో టోర్నీని నిర్వహిస్తున్నా పలువురు క్రికెటర్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంతో తాము పునరాలోచనలో పడ్డామని, ఇలాంటి స్థితిలో ఐపిఎల్‌ను నిర్వహించడం కంటే వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చామని వివరించారు. ఇక టోర్నీని ఇప్పటికిప్పుడూ నిర్వహించడం సాధ్యం కాక పోవచ్చని పటేల్ పేర్కొన్నారు. పరిస్థితులు ఎప్పుడూ అనుకూలిస్తే అప్పుడే ఐపిఎల్ నిర్వహణపై దృష్టి సారిస్తామన్నారు. అప్పటి వరకు ఐపిఎల్ జరుపడంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

IPL 2021 Postponed after players test positive for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News