Wednesday, May 15, 2024

ఇరాన్ నౌకాదళంలోకి మరో రెండు క్షిపణులు

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : ఇరాన్ నౌకాదళం సరికొత్త అధునాతన క్రూయిజ్ క్షిపణులను సంతరించుకుంది. ఈ విషయాన్ని ఇరాన్ స్వయంగా అధికారికంగా ఆదివారం ప్రకటించింది. తమ నౌకాదళ అంబులపొదిలోకి ఇప్పుడు కొత్తగా తలయిహ్, నసీర్ క్షిపణులు చేరినట్లు అధికార వర్గాల సమాచారం ప్రాతిపదికన ఇరాన్ అధికారిక టీవీ తెలిపింది. ఈ రెండు మిస్సైల్స్ ఇప్పుడు హిందూ మహాసముద్రం సమీపంలోని నౌకా కేంద్రానికి వచ్చి చేరాయి. ఇరాన్ రేవు కొనారక్‌కు దగ్గరలో ఈ నౌకాకేంద్రం నెలకొని ఉంది. ఇప్పుడు వచ్చిచేరిన క్షిపణులు అత్యంత అధునాతన సాధనసంపత్తిని కలిగి ఉన్నట్లు ఇరాన్ నౌకాదళాధికారి అడ్మిరల్ షాహ్రామ్ ఇరానీ తెలిపారు. ఇవి దాదాపు వేయి కిలోమీటర్ల దూరం వరకూ లక్షాన్ని ఛేదించగలవు. పైగా ఈ మిస్సైల్స్ తమ ప్రయాణ దశలో ఉన్నట్లుండి కూడా దిశను మార్చుకోగలవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News