Saturday, April 27, 2024

గుజరాత్ తీరంలో ఇరాన్ మాదకద్రవ్యాల నౌక పట్టివేత

- Advertisement -
- Advertisement -

 

Heroin Gujarat
అహ్మదాబాద్: భారత తీరగస్తీ దళం, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఎటిఎస్) సంయుక్తంగా 30 కిలో హెరాయిన్ మాదకద్రవ్యంతో వెళుతున్న ఇరాన్ నౌకను పట్టుకున్నారు. ఆ మాదకద్రవ్యం సరకు అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 150 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.
ఆ నౌకలో ఏడుగురు నావికా చాలకులున్నారు. ఆ నౌక శనివారం రాత్రి భారత జలాలలోకి ప్రవేశించగానే భారత అధికారులు దానిని పట్టేసుకున్నారు. ఆ నావికా చాలకులంగా ఇరాన్ జాతీయేలే. వారిని విచారించేందుకు గుజరాత్ రేవుపట్టణానికి తీసుకెళ్లారు. “ పెద్ద ఎత్తున అక్రమ మాదకద్రవ్యాల సరకు సముద్రం మధ్యలో డెలవరీ కానుందని మాకు విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దాని ఆధారంగానే పట్టుకున్నాము” అని యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ డిఐజి హిమాంశు శుక్లా తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా గుజరాత్ తీరం పాకిస్థాన్ లేక ఇరాన్ నుంచి మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు అనువైన రూట్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News