Saturday, April 27, 2024

చమురు ధరలు, ప్రపంచ జిడిపిపై ప్రభావం చూపనున్న గాజా యుద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచంలో చాలా దేశాలు ద్రవ్యోల్బణంతో పోరాటం చేస్తున్న తరుణంలో వచ్చిన ఇజ్రాయెల్‌గాజా యుద్ధంప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమైన ప్రభావం చూపిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. శనివారం ఎన్‌డివికిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ, ఈ యుద్ధం గనుక ప్రాంతీయ ఘర్షణగా మారి, మరిన్ని దేశాలు దీనిలో పాలుపంచుకున్నట్లయితే ఇది చమురు ధరలపై ప్రభావం చూపిస్తుందని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి ప్రపంచ జిడిపి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. ‘ పౌరుల మరణాల రూపంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు హృదయాన్ని కలచి వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిణామాల విషయానికి వస్తే రాబోయే రోజుల్లో ఇది ఏ యుద్ధం మారుతుందనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పరిణామాలను ముఖ్యంగా చమురు ధరలపై ప్రభావాన్ని చూపిస్తుంది’ అని గీతా గోపీనాథ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News