Sunday, April 28, 2024

కృష్ణబిలాల మూలాల పరిశోధనకు ఇస్రో సిద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ “ ఇస్రో” వచ్చే కొత్త సంవత్సర ప్రారంభంలో మరో అత్యంత సాహసోపేత , ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమానమైన ప్రకాశంతో కూడిన 5ం కాంతి పుంజాల మూలాలను పరిశోధించడమే ఈ ప్రయోగ లక్షం. ఈ 50 కాంతిపుంజాల్లో కృష్ణబిలం ఎక్స్‌రే జంట నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ నక్షత్రాలు, నాన్‌థెర్మల్ సూపర్‌నోవాల అవశేషాలు ఇమిడి ఉన్నాయి. వీటన్నిటి పుట్టుక మూలాలను తెలుసుకోడానికి మొట్టమొదటిసారిగా ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్‌ను జనవరి 1న ఉదయం 9.10 గంటల సమయంలో ఇస్రో ప్రయోగిస్తుంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా యాత్రలో ఇదో చెప్పుకోదగిన మైలురాయి. ఇది భారత దేశం మొట్టమొదటి ప్రయోగమే కాదు, ప్రపంచం లోనే రెండవది. ఇంతకు ముందు నాసా ఇమేజింగ్ ఎక్స్‌రే పొలారిమేట్రీ ఎక్స్‌ప్లోరెర్ ( ఐఎక్స్‌పిఇ) 2021లో ఇలాంటి ప్రయోగం చేసింది.

ఇప్పుడు ఇస్రో అదే తరహాలో అత్యంత క్లిష్టమైన పరిశోధనకు పూనుకోవడం విశేషం. ఈ శాటిలైట్‌ను వృత్తాకార దిగువ భూ కక్ష లోకి 500700 కిలోమీటర్ల పరిధిలో ఇస్రో ప్రవేశపెడుతుంది. ఈ శాటిలైట్ కనీసం ఐదేళ్ల పాటు తన పరిశోధనను నిర్వహిస్తుంది. ఈ శాటిలైట్ ప్రాథమిక పేలోడ్ మధ్యస్థాయి ఎక్స్‌రే శక్తి లోని ధ్రువణత కోణాన్ని గణిస్తుంది. ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోపీ , టైమింగ్ పేలోడ్ స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ శాటిలైట్‌ను యుఆర్ శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. విశ్వం లోని దివ్య వస్తువుల భౌతికత్వాన్ని నూతన దృక్కోణంలో ఆవిష్కరించడమే ఈ ప్రయత్నం. ఎక్స్‌రేల ధ్రువణీయతను లెక్కించడం అంటే సుదూర అంతరక్ష దివ్యశక్తుల భౌతికత్వాన్ని, వాటి ఉద్గారాల కీలక సమాచారం తెలుసుకోడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News