Saturday, May 4, 2024

ఐటి ఉద్యోగులకు మూడు విడతల్లో లాగ్‌అవుట్

- Advertisement -
- Advertisement -

ట్రాఫిక్ జామ్‌తో సైబరాబాద్ పోలీసులు నిర్ణయం

మన తెలంగాణ/సిటీబ్యూరో: భారీ వర్షాల కారణం గా సైబరాబాద్‌లోని హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో సైబరాబాద్ పోలీసులు ఐటి ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణ యం తీసుకుంది. మంగళవారం, బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే ఐటి ఉద్యోగులు మూడు విడతల్లో లాగ్ అవుట్ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఐటి ఉద్యోగులు లాగ్ అవుట్‌ను మూడు దశల్లో చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి భారీ వర్షం కురియడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ముఖ్యంగా హైటెక్‌సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది. వేలాది వాహనాలు గంటల కొద్ది ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో అంబులెన్స్‌లకు సైతం దారి దొరకలేదు. కార్యాలయాలు ముగిసి సమయంలో భారీ వర్షం కురియడంతో ఉద్యోగులు అర్ధరాత్రి వరకు రోడ్లపై ఉన్నారు. హైటెక్‌సిటీలో ఎటువైపు చూసినా కూడా వాహనాలు భారీ సంఖ్యలో బారులుతీరాయి. ట్రాఫిక్ సమస్య తీవ్ర కావడంతో ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీనిని నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు ఐటి ఉద్యోగులకు మూడు దశల్లో లాగ్‌అవుట్ చేసుకోవాలని సూచించారు.

ఫేజ్1: ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉంటే ఐటి ఆఫీసులు సా. 3 గంటలకు లాగ్‌అవుట్ చేసుకోవాలి.
ఫేజ్2: ఐకియా నుంచి బయోడైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉంటే ఆఫీసులు సా.4.30 గంటలకు లాగ్‌అవుట్ చేసుకోవాలి.
ఫేజ్3: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటి ఆఫీసులు సా. 3 గంటలకు లాగ్‌అవుట్ చేసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News