Friday, May 10, 2024

హీరో విజయ్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

vijay

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఇంట్లో జరుగుతున్న ఆదాయం పన్ను శాఖ అధికారుల సోదాలు గురువారం సాయంత్రం ముగిశాయి. చెన్నైలోని నీలాంకరైలోని విజయ్ నివాసంలో జరిపిన సోదాలలో ఎటువంటి అక్రమాలు బయట పడలేదని ఐటి వర్గాలు తెలిపాయి. బిగిల్(తెలుగులో విజిల్), నిర్మాణంలో ఉన్న మాస్టర్ చిత్రాలకు సంబంధించిన సంపాదనలో ఆయన అన్ని పన్నులు కట్టారని అధికార వర్గాలు తెలిపాయి. బిగిల్ చిత్రానికి రూ.50 కోట్లు, మాస్టర్ చిత్రానికి రూ.80 కోట్లు విజయ్ పారితోషికం తీసుకున్నారని, అందుకు సంబంధించిన అన్ని పన్నులు ఆయన కట్టేశారని ఐటి శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. విజయ్ నివాసంపై గత నెల దాడి సందర్భంగా ఐటి అధికారులు కొన్ని గదులకు, అల్మారాలకు, లాకర్లకు సీలు వేశారు. వాటిని గురువారం సాయంత్రం తొలగించినట్లు ఐటి అధికారులు చెప్పారు.

IT raids concluded at Tamil Hero Vijays residence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News