Sunday, May 5, 2024

మహబూబ్‌నగర్‌లో ఐటి టవర్‌ను ప్రారంభించనున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

 

మహబూబ్ నగర్: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటి టవర్ ప్రారంభోత్సవం పై టిఎస్ఐఐసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మహబూబ్ నగర్ లోని దివిటీ పల్లీ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ను మే 6 వ తేదీన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుచే ఘనంగా ప్రారంభించటానికి ఏర్పాట్లు చేయాలనీ మంత్రి అదేశించారు. జాతీయ రహదారికి ఐటి టవర్ కి వెళ్లే దారిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా పెద్ద ముఖ ద్వారము కనెక్టింగ్ రోడ్డు అనుసంధానంగా నిర్మించాలని ఈ సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.

అలాగే ఐటి టవర్ నుంచి మహబూబ్ నగర్ పట్టణానికి అధునాతన రోడ్లను నిర్మించాలని మంత్రి జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు. ఐటి టవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను ఘనంగా చేయాని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఐఐసి జోనల్ మేనేజర్ డి. రవి, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ రెడ్డి, ప్రముఖ కన్సల్టెంట్ రాజ్ కుమార్, నిర్మాణ సంస్థ గుత్తేదారులు నరసింహ, రాజశేఖర్ రెడ్డి ,అమర రాజా సంస్థ ప్రతినిధులు మసూద్ రవితేజలు, ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News