Thursday, September 25, 2025

సాహితీ ఇన్ ఫ్రా కేసులో మరో కీలక మలుపు

- Advertisement -
- Advertisement -

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. నటుడు జగపతిబాబు ఇడి విచారణకు హాజర య్యారు. భారీ మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్‌ఫ్రా కేసులో భాగంగా, అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఇడి కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ విచారణలో జగపతిబాబు గతంలో సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ యాడ్స్‌లో నటించే అంశంపై ఇడి అధికారులు దృష్టి సారించినట్టు సమాచారం. ఆ సంస్థ ప్రకటనల్లో నటించినందుకుగాను ఆయనకు అందిన పారితోషికం, చెల్లింపుల మార్గాలపై వివరాలు సేకరించినట్టు తెలి సింది. ఆ లావాదేవీ ల గురించి కూపీ లాగినట్లు సమాచారం. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకర్షించిన సాహితీ ఇన్‌ఫ్రా, దాదాపు 700 మంది నుంచి రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ.

ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి అక్ర మాలకు పాల్పడ్డారని ఇడి దర్యాప్తులో వెల్లడైంది. ఇదే కేసులో భాగంగా మోసం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన రూ.161 కోట్ల విలువైన ఆస్తులను ఇడి ఇప్పటికే అటాచ్ చేసింది. కేవలం ప్రకటనల్లో నటించినందుకే ఆయన్ను సాక్షిగా విచారించారా లేక మరేదైనా కోణం ఉందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, సాహితీ ఇన్ఫ్రా, ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట కొనుగోలు దారుల నుంచి రూ.248. 27 కోట్ల మేర వసూలు చేసి, నిర్మాణాలు చేపట్టకుండా మోసానికి పాల్పడిందని ఇడికి ఫిర్యాదులందాయి. ఈ మేరకు సాహితీపై మనీలాండరిం గ్ కేసు నమోదు చేసి ఇడి దర్యాప్తు చేసింది. సాహితీ నిర్వాహకులు రూ.126కోట్లు కొనుగోలు దారుల నుంచి వసూలు చేసినట్టు ఇడి అధికారులు గుర్తించారు. సాహితీ కేసులో మరింత లోతైన విచారణలో భారీఎత్తున స్కామ్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే సాహితీ ఇన్ఫ్రాకు ప్రకటనలు చేసిన నటినటులను ఇడి విచారిస్తోంది.

Also Read: ‘పూరి’ గీసిన ‘చిరు’ చిత్రం.. ఆయనకెంతో స్పెషల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News