Tuesday, May 7, 2024

ప్రకృతి తనయుడు ‘సింబా’గా

- Advertisement -
- Advertisement -

రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింబా’. అరణ్యం నేపథ్యంలో అల్లుకున్న కథతో ‘సింబా’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌కు రచయిత సంపత్ నంది. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంపత్ నంది టీమ్ వర్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంపత్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. విలక్షణ యాక్టర్ జగపతిబాబు ‘సింబా’లో ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే వ్యక్తిగా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్ నంది. ఫస్ట్‌లుక్ పోస్టర్లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ‘ప్రకృతి తనయుడు ఇతడు… జగపతిబాబును సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్ సింబాను పరిచయం చేస్తున్నాము. అని మేకర్స్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News