Monday, April 29, 2024

జహంగీర్ పురిలో కూల్చివేతలు ఆపివేత

- Advertisement -
- Advertisement -
bulldozer
‘యథాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అన్ని చర్యలను తీవ్రంగా పరిగణిస్తాం’ : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: వాయువ్య  ఢిల్లీలోని జాంగీర్‌పురి ప్రాంతంలో అన్ని కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలని న్యాయమూర్తులు ఎల్‌ఎన్ రావు , బిఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం కోర్టు నిర్ణయం ఉన్నా కూడా కూల్చివేతలు కొనసాగడాన్ని తీవ్రంగా పరిగణించి వాటిని మేయర్‌కు తెలుపుతామని కూడా పేర్కొంది. జమీయత్ ఉలామాఇహింద్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఎన్‌ఎండిసికి రెండు వారాల్లోగా జవాబు ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది.

ఈ రోజు(గురువారం) ఉదయం 11 గంటలకు జహంగీర్‌పురిలో కూల్చివేత డ్రైవ్‌కు సంబంధించిన కేసును బెంచ్ విచారణ ప్రారంభించింది.  బిజెపి నేతృత్వంలోని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు ఏడు బుల్‌డోజర్‌లు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లడం, ప్రార్థనా స్థలం వెలుపలి ద్వారంతో సహా అనేక నిర్మాణాల భాగాలను ధ్వంసం చేయడం గమనించింది. ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైన కూల్చివేత యథాతథ స్థితిని కొనసాగించాలని 11 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ రెండు గంటల పాటు కొనసాగింది.ఇదిలా ఉండగా, తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లో బుధవారం సాయంత్రం స్థానిక బిజెపి కార్యకర్తను అతని ఇంటి వెలుపల నలుగురు వ్యక్తులు కాల్చి చంపారు. ఆ వ్యక్తిని జితు చౌదరిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News