Friday, April 26, 2024

ఉర్రూతలూగిస్తున్న ‘రుద్రంగి’ సినిమా ఫోక్ సాంగ్ ‘జాజిమొగులాలి’..

- Advertisement -
- Advertisement -

బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రంగి’. ఇటీవల ఈ సినిమాలోని ముఖ్య పాత్రలను రివీల్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసిన చిత్రయూనిట్ తాజాగా ఫోక్ సాంగ్ రిలీజ్ చేసింది.
‘జాజిమొగులాలి’ అంటూ సాగే ఈ పాటని మోహన భోగరాజు పాడగా ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి తన అందాలతో అలరిస్తూనే ఫోక్ సాంగ్ బీట్ కి భాను మాస్టర్ కోరియోగ్రఫీలో అద్భుతంగా డాన్స్ చేసింది.

పూర్తి తెలంగాణ యాసలో సాగే ఈ జానపద పాటకి అభినయ శ్రీనివాస్ క్యాచి లిరిక్స్ అందించగా.. నాఫల్ రాజా ఏఐఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై కవి, గాయకుడు, మ్మెల్యే రసమయి బాలకిషన్ భారీ నిర్మాణ హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News