Friday, May 3, 2024

‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Jathi Ratnalu Movie Trailer launched by Prabhas

‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న రెండో చిత్రం ‘జాతిరత్నాలు’. ఈ సినిమాలో నవీన్ తోపాటు రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమాకు అనుదీప్‌ కె.వి దర్శకత్వం వ‌హించాడు. ఈ మూవీలో నవీన్ కు జోడీగా హైదరాబాది అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ విడుదల చేశాడు. ఫ‌న్ తో కొనసాగిన ఈ ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్వప్న సినిమా పతాకంపై డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ మార్చి 11న థీయేటర్లలో సందడి చేయనుంది.

Jathi Ratnalu Movie Trailer launched by Prabhas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News