Thursday, May 16, 2024

బ్లింకెన్‌కు విదేశాంగం, జాన్‌కెర్రీకి పర్యావరణం

- Advertisement -
- Advertisement -

Joe Biden announced positions in his cabinet

 

కేబినెట్‌ను వెల్లడించిన బైడెన్

జోబైడెన్ తన కేబినెట్‌లోని కీలక స్ధానాలకు నియామకాలను ప్రకటించారు. విదేశీ వ్యవహరాలశాఖకు ఆంటోనీ బ్లింకెన్‌ను, అంతర్గత భద్రతాశాఖకు ప్రముఖ న్యాయవాది అలెజాండ్రో మయోర్కస్‌ను, జాతీయ భద్రతా సలహాదారుగా జేక్ సులివాన్‌ను నియమించారు. అంతర్గత భద్రతకు మొదటిసారి లాటిన్ దేశీయుడైన అలెజాండ్రోను నియమించారు. జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌గా సిఐఎ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అవ్రిల్‌హైన్స్‌ను నియమించారు. నిఘా విభాగం చీఫ్‌గా ఈమె మొదటి మహిళా అధికారి. సుదీర్ఘకాలం దౌత్యవేత్తగా పని చేసిన లిండాథామస్ గ్రీన్‌ఫీల్డ్‌ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించారు. వీరంతా 2009-17 కాలంలో ఒబామాబైడెన్ ప్రభుత్వంలో పని చేసినవారే. విదేశాంగశాఖ మాజీ మంత్రి జాన్‌కెర్రీని పర్వావరణ రాయబారిగా నియమించారు. అమెరికా జాతీయ భద్రతా మండలిలోకి పర్యావరణ రాయబారి పదవిని కొత్తగా తీసుకొచ్చారు. పర్యావరణంపై 2015 పారిస్ ఒప్పందం నుంచి ట్రంప్ ప్రభుత్వం వైదొలగగా, బైడెన్ దానిపై పునారలోచన చేయనున్నట్టు భావిస్తున్నారు. కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి అత్యధికంగా వదులుతున్న దేశాల్లో అమెరికాది రెండో స్థానం. చైనాది మొదటి స్థానం. దాంతో, పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News