Wednesday, May 15, 2024

జి 20కి రెండు రోజుల ముందే అతిధిగా బైడెన్..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారతదేశ ఆతిధ్యంలో జరిగే జి 20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీకి వస్తున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ భారత్ పర్యటన , జి 20 సమ్మిట్‌లో ఆయన కార్యక్రమాల వివరాలను వైట్‌హౌస్ వర్గాలు వెలువరించాయి. జి 20 చారిత్రక సదస్సు నేపథ్యంలో ఈ నెల 8న ప్రధాని మోడీ బైడెన్ ద్వైపాక్షిక సమావేశం ఉంటుంది. ఈ నెల 9, 10 తేదీలలో జి 20 సమ్మిట్ ఢిల్లీ ప్రగతిమైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. కాగా సదస్సుకు దాదాపు మూడు రోజుల ముందే బైడెన్ ఇండియాకు రావడం కీలక పరిణామం అయింది. వచ్చే శనివారం ఆదివారం జి 20 సదస్సులో బైడెన్, మోడీ పాల్గొంటారు. జి 20 సదస్సులో పలు ప్రపంచ సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉక్రెయిన్‌పై రష్యా దాడుల విషయం ప్రస్తావనకు రానుంది. రష్యా నేత పుతిన్ ఈ భేటీకి రావడం లేదు. కాగా చైనా అధినేత హాజరీ గురించి స్పష్టత లేదు. ఈ దశలో బైడెన్ , మోడీ చర్చలకు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ ఇక్కడి నుంచి ఈ నెల 10న వియత్నాం పర్యటనకు వెళ్లుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News