Thursday, May 2, 2024

పెగాసస్‌పై సుప్రీంకోర్టులో పిల్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌పై సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ స్పైవేర్ ద్వారా సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని, అది రాజ్యాంగ విరుద్ధమని బ్రిట్టస్ సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై దర్యాప్తు జరగాలని ఆయన కోరారు. ఇండియాలోని 300మంది ప్రముఖుల స్మార్ట్‌ఫోన్లపై పెగాసస్ స్వైవేర్ ద్వారా నిఘా పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వాస్తవాల్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని బ్రిట్టస్ కోరారు. ఎంతో గంభీరమైన ఈ అంశంలో దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదని బ్రిట్టస్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వం తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండించకపోవడం, అంగీకరించకపోవడం అనే ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీన్నిబట్టి ప్రభుత్వమే నిఘా జరిపించి ఉండాలి లేదా విదేశీ సంస్థ ఆ చర్యకు పాల్పడి ఉండాలని ఆయన ఆరోపించారు. విదేశీ సంస్థ ద్వారా నిఘా అన్నది సీరియస్ అంశమని ఆయన అన్నారు.

John Brittas moves SC Seeking probe against Pegasus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News