Saturday, May 4, 2024

కాంగ్రెస్ కేవలం సోదరసోదరీ పార్టీనే

- Advertisement -
- Advertisement -

JP Nadda slams congress party

వంశవృక్ష పార్టీలతో ముప్పు : నడ్డా

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అటు జాతీయం కాదు ఇటు భారతీయం, ప్రజాస్వామికం కాదని , ఇది ఇప్పుడు కేవలం భాయ్ బెహన్ ( సోదర సోదరీ ) పార్టీ అయి కూర్చుందని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. వంశానుగత పార్టీల తీరుతెన్నులపై ఆయన గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ సంబంధిత విషయంపై ఏర్పాటు అయిన సెమినార్‌లో నడ్డా మాట్లాడారు. వంశాల వారసత్వ ప్రాతిపదికన సాగే పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.రాజ్యాంగ నిర్ధేశిత అంశాల మేరకు చూస్తే పుట్టుక వారి వంశాల ప్రాతిపదికన వివక్షతలు కుదరవు. అయితే ఆయా పార్టీలలో ఇందుకు విరుద్ధంగా కేవలం వారి జన్మవిశేషాలే ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఫలానా వంశంలో జన్మించాడు కాబట్టి అటువంటి వారికే కీలక స్థానాలు కట్టబుట్టే పద్ధతి ఉంది.

ఇతరుల అర్హతలను ఈ క్రమంలో పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌లోనే కాకుండా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఈ విధంగా వంశాలక్రమంలోనే ప్రాంతీయ పార్టీల నాయకత్వాలు నడుస్తున్నాయని అన్నారు . కాంగ్రెస్ ఇప్పుడు కేవలం భాయ్ బెహన్ పార్టీ కావడం విచారించదగ్గ విషయమే. . కాంగ్రెస్‌లో ఇప్పుడు రాహుల్, ప్రియాంకల ఆధిపత్యాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ధోరణితోనే నలు దిక్కులా పలు ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని నిందించారు. ప్రజాస్వామ్యం దండిగా ఉన్న పార్టీ ఒక్క బిజెపియే అని ఆయన తెలియచేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News