Tuesday, May 7, 2024

డ్యూయల్ షేడ్ రోల్‌లో..

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్ 30వ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తదుపరి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్ట్ కోసం సిద్ధం కావాల్సి ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎన్టీఆర్ 31 కథాంశం ఎలా ఉంటుంది? అన్నదానిపై అభిమానుల్లో రకరకాలుగా చర్చ సాగుతోంది. తాజా సమాచారం మేరకు తారక్‌ని ఈ చిత్రంలో డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో చూపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దేశభక్తి, తీవ్రవాదం, రాజకీయం అనే ఎలిమెంట్స్‌ని టచ్ చేసే స్క్రిప్ట్‌ను ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నాడని తెలిసింది. ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగానూ తారక్‌లో డ్యూయల్ షేడ్ చూపిస్తారట. సీరియస్ డ్రామాగా కొనసాగే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా చూపిస్తారు. ఇప్పటివరకూ తారక్‌లో చూడని కొత్త కోణం ఈ సినిమాలో చూస్తారని టాక్ వినిపిస్తోంది.

Jr NTR to play dual role in Prashanth Neel Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News