Friday, April 26, 2024

చేతికి చెయ్యిచ్చిన సింధియా

- Advertisement -
- Advertisement -

Jyotiraditya Scindia

 

కాంగ్రెస్‌కు గుడ్‌బై… మోడీ, అమిత్‌షాతో భేటీ

రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్‌ఎలు
ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు
మధ్యప్రదేశ్‌లో చరమాంకంలో కమల్‌నాథ్ ప్రభుత్వం

న్యూఢిల్లీ/ భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సంక్షోభంలో కూరుకు పోయింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడానికి సిద్ధపడడంతో పాటుగా, ఆయనకు మద్దతుదారులుగా
భావిస్తున్న 22 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కూడా పార్టీకి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం బీటలు వారి కూలిపోయే స్థితికి చేరుకుంది. ఈ పరిణామాలతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను ఆయనను పార్టీనుంచి బ హిష్కరించినట్లు ప్రకటించింది. మంగళవారం ఉ దయం దేశమంతా హోలీ వేడుకలు జరుపు కొంటూ ఉన్న తరుణంలో సింధియా ఢిల్లీలో బిజె పి సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అ మిత్‌షాను కలిశారు.

అనంతరం ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశాల్లో వారు ఏం మాట్లాడుకున్నారో అధికారికంగా వెల్లడి కాకపోయినప్పటికీ సింధి యాతో సుదీర్భ చర్చలు జరపాలన్న మోడీ, అమిత్‌షాల నిర్ణయం వారు ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టం చేస్తుందని బిజెపి వర్గాలు అంటున్నాయి. కాగా సింధియా ఈనెల 12న భోపాల్‌లో బిజెపిలో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. సింధియా మొదట గ్వాలియర్‌కు వెళతారని, ఆ తర్వాత తన మద్ద తుదారులతో కలిసి భోపాల్ వస్తారని ఆ వర్గాలు తెలిపాయి. సింధియా పార్టీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయన వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కూడా పార్టీకి రాజీనామా చేశారు.

ప్రస్తుతం బెంగళూరులో ఉన్న19 మంది ఎంఎల్‌ఎలు ఫ్యాక్స్ ద్వారా తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు పంపించగా, మరో ముగ్గురు ఎంఎల్‌ఎలు భోపాల్‌లో స్పీకర్‌కు తమ రాజీనా మా లేఖలను అందజేశారు. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ హోలీ వేడు కల కోసం లక్నో వెళ్లారు. ఈ పరిణామాల గురిం చి తెలియగానే ఆయన తన పర్యటనను కుదిం చుకొని భోపాల్‌కు తిరిగి భోపాల్‌కు బలుదేరారు. ఇదిలా ఉండగా ఆరుగురు మంత్రుల రాజీనామా లను ఆమోదించినట్లు సిఎం తెలిపారు.

సోనియాకు సింధియా లేఖ
ప్రధాని మోడీతో సమావేశమైన తర్వాత సింధియా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ పంపారు. ఈవిషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. ‘గత 18 ఏళ్లుగా కాగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇక వెళ్లిపోవలసిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్ తో కలిసి ఉంటే రాష్ట్రానికి, దేశానికి సేవ చేయలేనేమోననిపిస్తోంది. నా ప్రజలు, నా కార్యకర్తల ఆశల కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తమమని భావిస్తున్నా.

ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన పార్టీకి, సహచర నేతలకు కృతజ్ఞతలు’ అని సింధియా ఆ లేఖలో పేర్కొన్నారు. సింధియా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే ఆయనను కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను సింధియాను తక్షణం కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు ఎఐసిసి ప్రధానకార్యదర్శి కె సి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

చౌహాన్‌తో ఎస్‌పి, బిఎస్‌పి ఎంఎల్‌ఎల భేటీ
మరో వైపు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బిఎస్‌పి, ఎస్‌పి ఎంఎల్‌ఎలు కూడా ప్లేటు ఫిరాయించేట్లు కనిపిస్తోంది. తాజా సంక్షభం నేపథ్యంలో ఎస్‌పి ఎంఎల్‌ఎ రాజేశ్ శుక్లా, బిఎస్‌పి సభ్యుడు రాజీవ్ కుషావాలు బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిశారు. బిజెపికి మద్దతు ఇవ్వాలని చౌహాన్ వారిని కోరినట్లు సమాచారం. వారు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సింధియా రాజీనామా చేయడంతో ఆయనకు సన్నిహితులగా ఉంటున్న పలువురు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. సింధియాకు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది కూడా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పలువురు జిల్లా స్థాయి నేతలు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

మ్యాజిక్ ఫిగర్ 104
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 230. అయితే ఒక కాంగ్రెస్ ఎంఎల్‌ఎ, మరో బిజెపి శాసన సభ్యుడు మృతి చెందడంతో సభ్యులసంఖ్య 228కు చేరింది. కాంగ్రెస్ 114, బిజెపి 107, స్వతంత్రులు నలుగురు, ఇద్దరు బిఎస్‌పి, ఒక ఎస్‌పి సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు స్వతంత్రులు, మిత్రపక్షాలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు 22 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 206కు చేరుకోనుంది. కమల్‌నాథ్ ప్రభుత్వం నిలబడాలంటే 104 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే 22 మంది కాంగ్రెస్ సభ్యుల రాజీనామాతో ఆ పార్టీ బలం 91కి పడిపోయింది. స్వతంత్రులు, బిఎస్‌పి, ఎస్‌పి సభ్యులందరూ మద్దతు కొనసాగించినప్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఆ పార్టీకి ఉండేట్లు కనిపించడం లేదు.

Jyotiraditya Scindia Resign to congress Party
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News