Tuesday, May 7, 2024

నిజామాబాద్ ఎంఎల్‌సి అభ్యర్థిగా మరోసారి కవిత!

- Advertisement -
- Advertisement -

Kavitha
హైదరాబాద్: ఎంఎల్‌సి అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమెను ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 1.00 గంటకు కవిత నామినేషన్‌ను వేయబోతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలోనే ఆమె ఎంఎల్‌సిగా ఉన్నారు. త్వరలో ఆమె పదవీ కాలం ముగియనుండటంతో కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి ఎంఎల్‌సి అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగనున్నారు. ఎంఎల్‌ఏ కోటాలో సింఎం కెసిఆర్ ఇపటికే ఐదుగురు ఎంఎల్‌సి అభ్యర్థులను ఖరారుచేసిన విషయం తెలిసిందే.
2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉన్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి భూపతి రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో అనర్హత వేటుపడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి కవిత ఎంఎల్‌సిగా ఎనికయ్యారు. అయితే ఆమె పదవీ కాలం 2022 జనవరి 4తో ముగియబోతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి ఆమెకు అవకాశం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News