Saturday, September 23, 2023

కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాను ముద్దాడాయి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి 60 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సిఎం కెసిఆర్ సూర్యాపేటలో పర్యటిస్తున్నారు. సూర్యాపేట ప్రగతి నివేదన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాక ముందు నల్లగొండ జిల్లా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, గత నాలుగేళ్ల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ప్రశంసించారు. నల్లగొండ జిల్లా ఇప్పుడు భారత దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని జగదీష్ కొనియాడారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పగలు జెండాలు మోసి రాత్రులు వాళ్ల మోచేతులు నీళ్లు తాగారని, కాంగ్రెస్‌లో నాయకులు రెండు వర్గాలుగా మారి రక్తాలు వచ్చేటట్లుగా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత యాబై సంవత్సరాల నుంచి తుంగతుర్తి, సూర్యాపేటకు పోచంపాడు జలాలు వస్తాయని ప్రజలు ఎదురుచూశారని కానీ రాలేదని, మూడేండ్లలోనే కాళేశ్వర జలాలు సూర్యాపేటకు జిల్లాకు వచ్చాయని జగదీష్ మెచ్చుకున్నారు. సిఎం కెసిఆర్ ముందుచూపుతోనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు అభివృద్ధిలో దూసుకపోతున్నాయన్నారు.

Also Read: సైబర్ నేరగాళ్ల ట్రాప్: యువతికి రూ. 79,500 టోపీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News